- పేరుకే టౌన్ ప్లానింగ్ అధికారులు
- మద్దతు మాత్రం అక్రమ నిర్మాణదారులకే..!
- ప్రభుత్వ ఖాజానాకు భారీగా గండికొడుతున్న అక్రమనిర్మాణదారులు
- చర్యలు తీసుకోవడంలో విఫలమౌతున్న దుండిగల్ మున్సిపల్ కమిషనర్…?
దుండిగల్ / కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట సింహపురి కాలనీలో రోజురోజుకూ అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. స్థానికంగా ఎలాంటి అనుమతుల్లేని కమర్శియల్ షెడ్ల నిర్మాణాలు చేస్తూ… కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వానికి గండికోడుతున్నారు కొందరు అక్రమ నిర్మాణదారులు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నీ తామై అనుమతుల్లేని అక్రమ నిర్మాణదారులకు పరోక్షంగా మద్దతు తెలుపుతూ… తమ విధులను మరిచిపోయి ఆమ్యామాలకు అలవాటుపడిన చైన్ మెన్లు ఉన్నతాధికారుల ఆదేశాలు బేకాతారు చేస్తూ అక్రమ నిర్మాణాల సమాచారం పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా అందినకాడికి దండుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని వందల సంఖ్యలో అక్రమనిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడంటూ మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. ఇదే విషమై బౌరంపేట గ్రామ పరిధిలోని సింహపురి కాలనీలో వెలుస్తున్న అనుమతుల్లేని కమర్శియల్ షెడ్ల నిర్మాణాలను కూల్చివేయాల్సిన స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నీ తామై వ్యవహారిస్తూ చర్యలు తీసుకోవాల్సింది పోయి వెన్నంటి ఉండి ప్రోత్సాహిస్తున్నారని స్థానిక ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమ్యామాలకు అలవాటుపడిన దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులపై థర్డ్ పార్టీ విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను నివారించాలని స్థానిక కమిషనర్ ను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వీరి కలెక్షన్లలో ఆయనకు సైతం వాటా ఉందనేది వాస్తవమేనని నిర్ణయానికి రావాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.












































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.