నవతరం

తెలుగు దినపత్రిక

నో యాక్షన్… ఓన్లీ కలెక్షన్

* మొద్దునిద్రలో సర్కిల్ 26 నోడల్ ఆఫీసర్

* అందినకాడికి దండుకుంటున్న సెక్షన్ ఆఫీసర్

* చర్యలు తీసుకోవడంలో విఫల్లమౌతున్న జోనల్ కమిషనర్, స్పెషల్ టాస్క్ఫోర్స్

కుత్బుల్లాపూర్: కూకట్పల్లి జోన్ జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్ ల్లో అంతులేని అక్రమ నిర్మాణాలు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు బల్దియా కమిషనర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల నివారణకు అందుబాటులో ఉంటారని ఎప్పటికప్పుడు చెబుతున్నా స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఇక్కడి అక్రమ, అనుమతుల్లేని బహుళ అంతస్థుల భవన నిర్మాణాల డాటా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాల్సింది మర్చిపోయి అక్రమ సంపాదనే ధ్యేయంగా తమ విధులనే మర్చిపోతున్నారు. కూకట్పల్లి జోన్ పరిధిలోని గాజులరామారం సర్కిల్ లో రోజు రోజుకో అనుమతుల్లేని భవన నిర్మాణాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పేరుకుపోతున్నాయి. ఈ విషయంలో పట్టణ ప్రణాళిక విభాగం పూర్తిగా విఫలమవుతుంది. కొన్ని వందల సంఖ్యలో భవన నిర్మాణదారులు టీజీ బీపాస్ చట్టాన్ని తుంగలో తొక్కి, తమ ఇష్టానుసారంగా బహుళ అంతస్థుల భవన నిర్మాణాలు నిర్మిస్తున్నారు. రెండు ఫ్లోర్ లకు అనుమతులు తీసుకుని నాలుగు ఫ్లోర్లు, అదనపు పెంట్ హౌస్ లు, సెల్లార్ నిర్మాణాలు, అసలు అనుమతులే తీసుకోకుండా కొన్ని నిర్మాణాలు… ఇలా ఎవరికి నచ్చినట్టు వారు భవన నిర్మాణాలు చేపడుతుంటే… స్థానిక టౌన్ ప్లానింగ్, నోడల్ అధికారి మాత్రం కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం క్రితం ఎంతో కొంత విధులు నిర్వహించిన అప్పటి సెక్షన్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ లు గాజులరామారంలోని శ్రీరామ్ నగర్ లో సురేంద్ర నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్థుల భవనాన్ని, రాహుల్ నిర్మిస్తున్న ఓ పెద్ద షెడ్డు నిర్మాణాన్ని సీజ్ చేశారు, అయినా ఆ రెండు అక్రమ నిర్మాణాలు ప్రస్తుతం పూర్తయ్యే స్టేజిలో ఉన్నాయి. ఇలా అందినకాడికి దండుకుంటూ అక్రమ నిర్మానాలపై తగిన చర్యలు తీసుకోవడంలో వంద శాతం విఫల్లమౌతున్నారు స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు. వీరే ఇంత అనుకుంటే పలుమార్లు స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఇక్కడి అక్రమ నిర్మానాలపై పలుమార్లు ప్రజావాని, మై జీహెచ్ఎంసీ ద్వారా, లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ… వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు స్థానిక నోడల్ అధికారి. కనీసం డెమోలిషన్ స్క్వాడ్ అండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయినా సరిగ్గా పనిచేస్తుందా అంటే… వారికి బండ్లలో డీజిల్ లేదంటూ బాహటంగానే చెబుతున్నారు సదరు సిబ్బంది. ఇదీ, కూకట్పల్లి జోన్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ తీరు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం… గాజులరామారం సర్కిల్ చంద్రగిరి నగర్ లోని జనని స్కూల్ ఎదురుగా నాలుగు అంతస్థుల కమర్శియల్ భవన నిర్మాణం, గాజులరామారం శ్రీరామ్ నగర్ రోడ్ నంబర్ 1 లో మధు అనే వ్యక్తి నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవన నిర్మాణం, జగద్గిరిగుట్ట వార్డ్ శ్రీనివాస్ నగర్ మధు ఫోటో స్టూడియో ఎదురుగా రెండంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు పొంది నాలుగు ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ నిర్మాణం చేపడుతున్న మాంగిలాల్ జ్యువలరీ భవన నిర్మాణం, గాజులరామారం రాంకీ మార్వెల్ వన్ ముందు రఫీ నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవన నిర్మాణం… ఇలా చెప్పుకుంటూ పొతే గల్లీకో అక్రమ నిర్మాణం వెలుస్తుంది. అందుకు స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమ సంపాదన, గాజులరామారం సర్కిల్ నోడల్ అధికారి అలసత్వం. ఇకనైనా టీజీ బీపాస్ చట్టానికి విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మానాలపై ఉక్కుపాదం మోపి సర్కిల్ 26 పట్టణ ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాలన చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

శ్రీరామ్ నగర్ కాలనీ, గాజులరామారం లో టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసిన అనంతరం నిర్మాణం పూర్తి చేసిన భవన నిర్మాణదారుడు

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading