నవతరం

తెలుగు దినపత్రిక

మెడకు చున్నీ బిగించి చంపారు

కుత్బుల్లాపూర్: హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చిన బాలిక ఉదంతం తెలిసిందే. ఈ మేరకు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి డీసీపీ సురేష్ కుమార్ హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్ల సీఎస్ పరిధిలోని షాపూర్ నగర్ ఎన్ఎల్బీ నగర్ కు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంలోని కళాకారిణి ఆంజలి (30) తన ఇద్దరు కుమార్తెలతో (ఇద్దరూ మైనరు బాలికలే) నివాసముంటుంది. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న అంజలి పెద్ద కుమార్తెకు ఇటీవల కట్టంగూర్ కు చెంది డీకే బృందంలో పని చేస్తూ స్థానికంగా నివాసముంటున్న పగిళ్ల శివ (19)తో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో విషయం తెలిసిన బాలిక తల్లి ఆంజలి నిరాకరించి బాలికను మందలించింది. దీంతో ఈ నెల 18వ తేదీన తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అంజలి 18వ తేదీన జీడిమెట్ల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆచూకీ కోసం గాలించిన పోలీసులు 20వ తేదీన వారిని పట్టుకొని పోలీసు స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చి శివకు నోటీసులిచ్చి ఎవరింటికి వారిని వంపించారు. ఈ క్రమంలో తన తల్లి ఆమె ప్రేమకు అడ్డుగా ఉందని భావించి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో పథకం రచించుకుంది.సదరు విషయాన్ని ముందుగా ఆమె ప్రియుడు శివకు రెవ్వగా అతను నిరాకరించాడు. దీంతో తన మాట వినకపోతే అతని పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను బెదిరించింది. దీంతో శివ ఒప్పుకోవడంతో పథకం ప్రకారం అంజలిని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శివ అతని సోదరుడు (మైనర్) తో కలిసి బైక్ పై బాలిక ఇంటికి సోమవారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న బాలిక చెల్లెల్ని బయటకు పంపి బాలిక శివకు ఫోన్ చేసి ఇంట్లోకి పిలిచి తెల్ల చున్నీని ఇచ్చింది. ఇంట్లో కూర్చీలో కూర్చొన్న అంజలిని శివ కింద పడేయడంతో ఆమె ముందుకు పడిపోవడంతో వెంటనే చున్నీని ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేశారు. దీనికి బాలిక, శివ తమ్ముడు సహకరించారు. అనంతరం ఆమె స్పృహ కోల్పోవడం అంజలి చనిపోయిందని నిర్ధారించుకొని శివ అతని సోదరుడు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు పంపిన బాలిక చెల్లెలు ఇంటికి వచ్చింది. దీంతో అమ్మ ఇప్పుడే ఇంట్లోకి రావొద్దన్నదని తన చెల్లెలిని బాలిక (నిందితురాలు) బయటనే కూర్చోబెట్టింది. చాలాసేపటి తర్వాత ఆ బాలిక ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి వంటగదిలో అంజలి స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్నట్లు ఆమె చిన్న కుమార్తె గుర్తించింది. దీంతో ఆ బాలిక ఏడుస్తూ అంజలిని లేపే ప్రయత్నం చేసింది. ఎంతకీ లేవకపోవడంతో 108కి గానీ, ఎవరినైనా పిలవాలని నిందిరాలిని కోరినా ఎవరినీ పిలవకుండా కాలయాపన చేసి చివరికి మరల శివకే ఫోన్ చేసింది. అమ్మ ఇంకా చనిపోలేదు త్వరగా వచ్చి చంపేయండని చెప్పింది. దీంతో తిరిగి వచ్చిన వారితో కలిసి నిందితురాలు అంజలిని కాపాడుతున్నట్లు నటించి ఆమె ముఖంపై నీళ్లు చల్లుతూ ఇంట్లో ఉన్న తన చెల్లెలిని తెలిసిన వారిని తీసుకురమ్మని బయటకు పంపారు. ఆంజలి చిన్న కూతురు బయటకు వెళ్లగానే మరల చున్నీని మెడకు బిగించి చంపారు. ఈ సారి హర్తా ఊపిరి పోయిందని నిర్ధారించుకొని నిందితులిద్దరూ అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు. సోమవారం రాత్రి 11.30 గంటల వరకు తల్లి హత్య విషయాన్ని నిందితురాలు ఎవరికీ తెలియకుండా గుట్టుగా ఉంచింది. అంజలి చిన్న కూతురు విషయాన్ని అందరికీ తెలపడంతో రాత్రి 11.40 గంటలకు డయల్ 100 ద్వారా జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంగా వారు సంఘటన స్థలికి చేరుకున్నారని డీసీపీ వివరించారు. మృతురాలి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆర్దరాత్రి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నల్గొండకు వెళ్లారు. తెల్లవారే సరికి హత్య చేసిన శివతో పాటు అతని సోదరున్ని అదుపులోకి తీసుకొని బుధవారం రిమాండ్ కు తరలిస్తామని డీసీపీ తెలిపారు.

కేసు వివరాలు వెల్లడిస్తున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading