* అక్రమ నిర్మాణాలకు నిలయం దమ్మాయిగూడ మున్సిపాలిటీ
* స్థానిక రాజకీయ నాయకులదే హవా
* కొత్త కమిషనర్ అయినా అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారా…?
కీసర: దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల, కీసర, యాద్గార్‌పల్లి గ్రామాల్లో అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు వారికి ఇష్టం వచ్చినట్టు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. పుర ఖజానాకు భారీగా గండిపడుతున్న డోంట్ కేర్ అన్నట్టు నడుస్తుంది అధికారుల తీరు. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది అధికారులు మారినా ఈ అక్రమ కట్టడాలు మాత్రం ఆగడం లేదని, కనీసం కొత్తగా వచ్చిన కమిషనర్ చర్యలు తీసుకుంటారని ఆశించిన మాకు నమ్మకం లేదు సారు అనే పద్ధతిలో ఉంది దమ్మాయిగూడ పురపాలక పరిస్థితి. కమిషనర్ మారిన ప్రతిసారి ఈ అక్రమాలకు అడ్డుకట్టపడుతుందని ఆశించిన ప్రతిసారీ నిరాశే ఎదురవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ, అది చాలదన్నట్లు లంచాలు తీసుకుంటూ ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, వారిపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.