మెదక్: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు (25.10.2025) ప్రత్యేక రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో కుల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ-జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 370 పీడీఎస్ బియ్యం సంచులు (ప్రతి సంచి 50 కిలోలు) తరలిస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని ఆపి పట్టుకున్నారు. పట్టుబడిన వాహనం, బియ్యం సంచులను కుల్చారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఇలాంటి అక్రమ రవాణా చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.