– పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
కుత్బుల్లాపూర్: అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. హైడ్రా వంటి సంస్థలు ఏర్పాటు చేసి కూల్చివేతలు చేస్తున్నా అక్రమ నిర్మాణదారులు మాత్రం ఆగడం లేదు. స్థానిక అధికారుల అండతో పరోక్ష సహకారంతో దర్జాగా చట్టాలు తుంగలో తొక్కి నిబంధనలు పాతరేసి తమ ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణ ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘిస్తూ నివాస ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి చేతివాటం ముడుపులు ముట్టజెప్పి దర్జాగా అక్రమ షెడ్లు, భారీ భవనాలు కట్టేస్తున్నారు. గాజులరామారం సర్కిల్ గాజులరామారం డివిజన్ కైసర్ నగర్ లోని నివాస ప్రాంతాల మధ్య ఓ వ్యక్తి ఏలాంటి అనుమతులు లేకుండా దర్జాగా షెడ్డు నిర్మాణం చేపడుతుండటమే నిదర్శనంగా చెప్పవచ్చు. గాజులరామారం ఎల్ ఎన్ బార్ పక్కన కూడా అక్రమంగా షటర్ల నిర్మాణం యథేచ్ఛగా
కొనసాగుతుంది.
గాజులరామారంలో టౌన్ ప్లానింగ్ ఉందా?
గాజులరామారం సర్కిల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం ఉందా ? జనావాసాలలో వాణిజ్య సముదాయాల భారీ షెడ్లు, షటర్లు నిర్మాణం జరుగుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతా తమ చేతిలో పనే అని అక్రమ నిర్మాదారుల నుంచి ముడుపులు తీసుకొని మౌనం వహిస్తున్నారా? సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటీ? అని స్థానిక సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరి ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.