నవతరం

తెలుగు దినపత్రిక

చీటింగ్ కేసును ఛేదించిన షాద్ నగర్ పోలీసులు

హైదరాబాద్, నవతరం: యజమానిని నమ్మించి స్టీల్ షాప్ నుంచి రూ.7.50 లక్షల నగదు దుర్వినియోగం చేసిన మేనేజర్‌ను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన వ్యాపారి రాజ్ కుమార్‌కు ఎలికట్ట గ్రామ శివారులో ఉన్న ‘దుర్గా స్టీల్’ పేరిట స్టీల్ షాప్‌ను కమల్ కిషోర్ వర్మ మేనేజర్‌గా ఉన్నారన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 3న వ్యాపారం ముగిసిన తర్వాత వచ్చిన రూ.7.50 లక్షలను ఆఫీస్ క్యాబిన్‌లో ఉంచి తాళం వేశారు. మరుసటి రోజు ఉదయం నగదు కనిపించకపోవడంతో ఫిర్యాదు చేయగా షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిసెంబర్ 8న నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో షాప్ వర్కర్ ద్వారా క్యాబిన్ తాళం తీసుకుని నగదును దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.7.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్, సిబ్బంది ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading