నవతరం

తెలుగు దినపత్రిక

అల్లరి మూకల అఘాయిత్యాలు

– బాధ్యతలు వదిలి, మద్యానికి బానిసలై గొడవలకు తెర లేపుతున్న  వైనం
– వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కొట్లాటకు దిగుతున్న తీరు
– మద్యం మత్తులో వారిలో వారికే గొడవలు
– ఆడవారిని గేలి చేస్తూ, అసభ్యకరమైన పదజాలాలతో సంభాషణలు
– పోలీసు సారు పట్టించుకోండి అని వేడుకుంటున్న ప్రజలు

నవతరం, భద్రాద్రి బ్యూరో / అశ్వరావుపేట / హైదరాబాద్: కొందరు చదువుకున్నవారైతే, మరికొందరు నిరక్షరాస్యులు. కొందరు బీదవారు మరికొందరు ధనికులు అంతా ఒకటై ఒక్కో గ్రామంలోని బజారుకో బెల్ట్ షాపు 24 గంటలు తెరిచి ఉండడంతో పని పాటలు వదిలి తల్లిదండ్రులను పట్టించుకోకుండా, మద్యానికి బానిసై ఆకతాయంగా రేయింబగళ్ళు మద్యం సేవిస్తూ… మత్తులో అసభ్యకర పదజాలాలతో గొడవలు పడుతూ, కష్టపడి పనిచేసి సేదదీరుదామని అంగడికి వచ్చిన కస్టమర్లపై ఎగబడి, అవసరమైతే కూల్డ్రింక్ మరియు బెల్టు షాపుల యజమానులపై కూడా దాడి చేస్తున్నారు. వయసులో పెద్దవారా, చిన్నవారా? అనే తేడా చూడకుండా ఒరేయ్, ఒసేయ్,, అనే పదజాలాలతో దుర్భాషలాడుతున్నారు. బీరు సీసాలతో తలలు పగల కొడతామని మరీ బెదిరిస్తున్న వైనం అశ్వరావుపేట మండల పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఉదాహరణకు గత నాలుగు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామంలో తన వృత్తి పనులను ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ సేదతీరుదామని ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగిన విలేఖరిపై పక్కనే ఉన్న వేదాంతపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లిక్కర్ తాగి బెదిరించడం జరిగిందని ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు. ఆకతాయిలు ఎప్పుడూ ఇలానే గొడవలకు తెగబడుతూ ఎంతోమంది అమాయకులను ఇబ్బందులకు గురి చేసినట్లు ఆ గ్రామ ప్రజలు ముక్తాకంఠంతో చెప్పడం జరిగింది.


రాజకీయ అండదండలతో అఘాయిత్యాలు
ఇక్కడ మరొక మెలిక ఉంది. అదేమిటంటే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే ముఠాకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉండడం చర్చనీయాంశంగా మారింది. వాళ్లు అఘాయిత్యాలు చేసుకుంటూనే పోతుంటారు. వీళ్లని కాపాడుతూ వీళ్ళ వెనువెంట ఈ రాజకీయ వర్గాలు సమర్ధిస్తూ ఇబ్బందులకు గురైన అనేకమంది బాధితులను సెటిల్మెంట్ పేరుతో ఒడ్డున పడేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఈ ఆకతాయిల భవిష్యత్తును ఎవరూ కాపాడాలనే కోణంలో చూస్తే అంతా స్వార్థమే కనిపించడం గమత్తైన విషయం.

వీళ్ళ భవిష్యత్తు పరిస్థితి ఏమిటి?
పిల్ల కాకికి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ అనే చందస్సున ఈ ఆకతాయిల పోకడలు ఇంకా ఇలానే కొనసాగడం విశేషం. ఇకనైనా పోలీసు అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని, వారికి అర్థమయ్యే భాషలో నచ్చజెప్పి కఠిన చర్యలు తీసుకుంటారో, పట్టించుకోకుండా గాలికోదిలేస్తారో? వేచి చూడాల్సిందే,,. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. మరి ఎన్ని దెబ్బలు కొట్టినా వీళ్ళ అఘాయిత్యాలకు చెక్ పడే సమయం ఇంకా రాకపోవడం సిగ్గుచేటని కొందరు మేధావులు,విశ్లేషకులు మాట్లాడుతున్నారు.

పోలీసు వారు పట్టించుకుంటారో లేదో వేచి చూడాల్సిందే
తిడితే తిట్టాడు,,మద్యం మత్తులో ఉన్నాడు పోనీలే అని వదిలేస్తే, రేపు కొట్టవచ్చు. ఇంకో రోజు అదే మద్యం మత్తులో పశువుల ప్రవర్తించి హత్యలు, అత్యాచారాలు చేసే అవకాశం లేకపోలేదని,మరోసారి ప్రజలు రక్షకభట డిపార్ట్మెంటును ప్రజలు హెచ్చరిస్తున్నారు.

పరిశీలిస్తే వీళ్ళపై అనేక కేసులు
ఎన్నోసార్లు అశ్వరావుపేట మండల పోలీసు ఠాణాలో ఈ ఆకతాయిలపై కేసులు నమోదైనట్లు తెలియ వచ్చిన సమాచారం. ఎదుటివారిని రెచ్చగొట్టి కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నట్లు ప్రజలు తెలియజేస్తున్నారు. మరి అయితే పోలీసు వారు వారిపై చర్యలు తీసుకోవడం లేదా? లేక మందలించి వదిలేస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. తుదకు సదరు విలేఖరి అశ్వరావుపేట పోలీసు స్టేషన్లో కేసు పెట్టినట్లు సమాచారం. ఇలాంటి ఆకతాయిల వలన తనకు కలిగిన ఇబ్బంది ఇతరులకు కలగకూడదననే నెపంతో, తనదైన శైలిలో అక్కడి ప్రజలను కొందరు పెద్దలను విచారించి, ప్రాణభయంతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కినట్లు సమాచారం.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading