నవతరం

తెలుగు దినపత్రిక

బ్లాక్ మెయిలింగ్ దంపతులు అరెస్ట్

కరీంనగర్ రూరల్, నవతరం: గత రెండు సంవత్సరాల నుండి కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరేపల్లి లో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంస్టాగ్రామ్ లో తమ ఫోటోలను పెడుతూ… ఫోనులో ఆమె పోస్టులు పంచుకోవడంతో వాటిని చూసి కొంతమంది వ్యక్తులు ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ, ఆమె నెంబరు తీసుకొని ఆమెను సంప్రదించగా డబ్బులు తీసుకొని రావాలని అయితేనే ప్రైవేట్ గా కలుస్తానని తన అడ్రస్ తెలుపగా దాదాపు 100 మంది వరకు కరీంనగర్ చుట్టు ప్రక్కన ఏరియాలో నుండి కొందరు బడా వ్యాపారస్తులు, యువకులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కు వచ్చి ఆమె భర్త అనుమతితో ఆమెతో వారు ప్రైవేట్ గా కలిసి డబ్బులు ఇచ్చేవారు. వారు ప్రైవేట్ గా కలిసిన సమయంలో నగ్నంగా ఉన్నప్పుడు తన భర్త ఫోన్లో వీడియో రికార్డు చేసేవారు. అనంతరం వారు ఇచ్చిన డబ్బులతో అపార్ట్మెంట్ ఈఎంఐ లోన్ కట్టేవారు. అంతే కాకుండా… ఒక టాటా కారు, అపార్ట్మెంట్లో ఏసీలు, సోఫా సెట్లు, విలువైన బెడ్స్ కొనుక్కునేవారు. వారి దగ్గరకు వచ్చిన వారిని మీరు నగ్నంగా ఉన్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి, వాటిని వైరల్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. నగ్నంగా ఉన్న ఫోటోలు బయటపడితే పరువు పోతదని కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు భయపడి వారు అడిగినంత సమర్పించుకునేవారు. ఒక సంవత్సరం కింద పరిచయమైన కరీంనగర్ కు చెందిన వ్యక్తి వారికి బాగా చనువుగా ఉండి ఆమె భర్తతో మందు త్రాగుతూ ఆమెతో ఎక్కువసార్లు కలువగా… అతనికి మాయ మాటలు చెప్పి వారి అపార్ట్మెంట్ లోన్లు, కారు ఇఎంఐ లు అతనితోనే కట్టించేవారు. చివరకు అతని వద్ద డబ్బులు అయిపోయి కొన్ని రోజులు రాకపోగా అతనికి వాట్సాప్ కాల్స్ చేసి నీవు ఎందుకు రావడం లేదని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు ఇక నన్ను మర్చిపోండని చెప్పగా వారిద్దరూ భార్యాభర్తలు అట్టి వ్యక్తిని మాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వు నిన్ను మర్చిపోతాము అతనికి చెప్పగా అతడు నా వద్ద డబ్బులు లేవని అన్నాడు. అంతటితో ఆగక నీవు 5 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకపోతే నీ వీడియోలు మీ ఇంట్లో వారికి పంపుతామని అప్పటికీ నీవు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించినారు. అతడు చంపుతారని భయపడి ఒక లక్ష రూపాయలు ఇస్తానని వాటిని తీసుకొని ఒంటరిగా వారి ఇంటికి పోయి ఇస్తానని శ్రీపురం కాలనీ బోర్డు వద్ద రాపిడో బుక్ చేయడానికి ఉండగా అప్పుడే తనను బెదిరించిన ఇద్దరు భార్యాభర్తలు వారి కారులో ఫిర్యాదుదారుని పిలిచి డబ్బులు ఇస్తావా లేదా…? లేకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించగా సదరు వ్యక్తి చంపుతారేమో అని భయపడి అతని వద్ద ఉన్న ఒక లక్ష రూపాయలు వారికి ఇచ్చి మిగతా నాలుగు లక్షలు రెండు రోజుల్లో పంపిస్తామని, ఇంతవరకు దాదాపు మీకు 14 లక్షల రూపాయల వరకు ఇచ్చానని నన్ను ఏమి చేయవద్దని వీడియోలను తీసివేయాలని వేడుకోగా వారు 4 లక్షలు ఇవ్వకపోతే తప్పకుండా వీడియోలు బయటపెట్టి నిన్ను ఏదో విధంగా చంపుతామని బెదిరించి వెళ్ళిపోయినారు. ఫిర్యాదుదారుడు భయపడుకుంటూ తన బంధువులకు మిత్రులకు జరిగిన విషయాన్ని చెప్పగా వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. అతడు పోలీస్ స్టేషన్కు 13.01.2026 న వెళ్ళి ఫిర్యాదు చేసి నిందితులకు ఇచ్చిన డబ్బులు ఫోన్ పే ద్వారా పంపానని చూపించగా పోలీస్ స్టేషన్లో భార్య భర్తల ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నేరస్తుల గురించి ఏసిపీ విజయ్ కుమార్ ఆదేశానుసారం సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు సిబ్బందితో రెండు గ్రూపులుగా గాలిస్తుండగా బుధవారం నాడు ఉదయం 8 గంటల సమయంలో కారు నడుపుకుంటూ వచ్చి టేస్టీ దాబా వద్ద ఆగి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానంతో వారిని పట్టుకొని విచారించారు పోలీసులు. జరిగిన విషయం మొత్తం చెప్పి నేరమును ఒప్పుకొని వారు కొన్న కారును, నగ్నంగా వీడియోలు తీసిన మొబైల్ ఫోన్ లను వారి వద్ద ఉన్న ఫిర్యాదు ఇచ్చిన చెక్కును చూపించగా వాటిని స్వాధీన పరుచుకొని 14 రోజుల రిమాండ్ కు తరలించారు పోలీసులు. నేరస్తులైన భార్యాభర్తలది మంచిర్యాల జిల్లా… వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా కరీంనగర్లో ఉంటూ ఈ వ్యవహారం జరుపుతున్నారు. కేసును 24 గంటల లోపు ఛేదించి పట్టుకున్నందుకు గాను కరీంనగర్ రూరల్ సిబ్బంది ని కరీంనగర్ రూరల్ ఏసిపీ విజయ్ కుమార్ అభినందించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading