తెలంగాణ కెనడా సంఘం (TCA), టొరంటో లో కనుల విందుగా అంగరంగా వైభవంగా శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది 2023 ఉత్సవాలు
టొరంటో / కెనడా, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో 25 మార్చి 2023 శనివారం రోజున కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు SVBF (శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్) ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 800 పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాన్సుల్ జనరల్ అపూర్వ వాస్తవ, కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టొరంటో ముఖ్య అతిథిగా విచ్చేశారు. మాధురి చాతరాజు, మంజు ఆకుల, సుజల బూత్కూరి, అపర్ణ భరద్వాజ్ పోపూరి, రాధిక బెజ్జంకి జ్యోతి ప్రజ్వలన చేయగా గుప్తేశ్వరి వాసుపిల్లి గణేష వందనంతో ఉగాది 2023 సంబరాలను ప్రారంభించారు. తెలంగాణ కెనడా సంఘం మొట్టమొదటిసారిగా వారి అధికారిక తెలుగు పత్రిక “TCA ఉగాది సంచిక” మొదటి సంచికను విడుదల చేశారు. దీనిని అపూర్వ శ్రీవాస్తవ ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు, సంచికలో పాల్గొన్న వారికి ధృవీకరణ పత్రాలు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున అందజేయబడును అని తెలిపారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా మాతృభాషలని ప్రోత్సహించుటకై వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా ఈ సందర్భంలో తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుండి భావితరాలకు అందజేయటం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదుపరి ప్రముఖ పూజారి నరసింహ చారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కుమారి ధాత్రి అంబటి, స్ఫూర్తి కొప్పు వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 92 మంది 17 వినూత్నమైన ప్రదర్శనలతో మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి, భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ,సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు – నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ శ్యామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల, యూత్ డైరెక్టర్ కుమారి ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – ప్రసన్న మేకల, మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు – దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస తిరునగరి, హరి రాహుల్, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం, పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2023 వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిశాయి.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.