నవతరం

తెలుగు దినపత్రిక

పట్టపగలే ప్రభుత్వ భూముల ఆక్రమణ

* చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక ప్రజలు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి : కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జగద్గిరిగుట్ట సర్వే నంబర్ 348/1లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే జగద్గిరిగుట్ట లో ఉన్నా ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల ఆగడాలతో చాలావరకు అంతరించిపోయాయి. తాజాగా రాజీవ్ గృహకల్ప పక్కనే వున్న చర్చి ముందు ‘ప్రభుత్వ భూమి’ అని సూచిక బోర్డు పాతి ఉన్న కూడా లెక్కచేయకుండా పట్టపగలే బేస్మెంట్ నిర్మాణం జరుగుతున్న కూడా రెవిన్యూ అధికారులు అటువైపు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో వెలిసిన ఈ బేస్మెంట్ నిర్మాణాన్ని కూల్చివేసి, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప మాజీ కార్యదర్శి అంజయ్య, పరశురాం లు సదరు విషయాన్ని స్థానిక ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading