నవతరం

తెలుగు దినపత్రిక

జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించాలి

* టీయూడబ్ల్యూజే(ఐజేయు) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు గౌడ్

కుత్బుల్లాపూర్: వర్కింగ్ జర్నలిస్టు లకు ఆరోగ్య భద్రత కోసం కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు)  మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు.  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం యూనియన్ సర్వ సభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నికలు గురువారం సూరారం లోని వీఐపీ ఫంక్షన్ హాల్లో జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన బాలరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులు ఐకమత్యంతో ఉండి సమస్యలను పరిష్కరించు కుందామన్నారు. జర్నలిస్టుల పక్షపతిగా పనిచేస్తున్న సంఘం మనదేనని తెలిపారు. ఈ సంఘం సభ్యులుగా ఉన్నందుకు గర్వపడాలని తెలిపారు. జర్నలిస్టుల కు తను ఎప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు శేఖర్, వెంకట్, సిరిగిరి శ్రీనివాస్, నాగేంద్ర చారి, సీనియర్ జర్నలిస్టులు రామారావు, అనిల్, గౌస్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.


నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షులుగా గోలిపల్లి దయాకర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు సాయిబాబా, ఉపాధ్యక్షులు సీతారామ రావు, కల్కి మూర్తి,  శ్రీధర్,  సురేష్, ప్రధాన కార్యదర్శిగా రెడ్డె బోయిన మల్లేష్ యాదవ్,  కార్య నిర్వాహక కార్యదర్శులుగా బేరోజు రణ దేవ్,  శేషారెడ్డి,  సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్, ప్రవీణ్, డా. ఎల్లంపల్లి నర్సింహులు, అన్వర్, కోశాధికారిగా శివశర్మ, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, సంతోష్, ఎండి లియాకత్ అలీ, గ్రంధాలు, నవీన్ రాజు,  సంతోష్, సలహాదారులుగా శేఖర్ గుంటూరు, గౌస్ మొయినుద్దీన్,  నాగేంద్ర చారీ, కె. వెంకట్, లాలయ్య, సిరిగిరి శ్రీనివాస్, కుంట అనిల్ లని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading