హైదరాబాద్ / దుబాయ్: ఉన్న ఊర్లో ఉపాధి కరువై నా ఒగ్గు కథ వలస వెళ్లింది కావచ్చు.. ఈ వలస ప్రపంచ వేదిక అవుతుంది.. కళలకు హద్దులు లేవు అని నిరూపిస్తుంది. గల్ఫ్ బిడ్డలు ఎక్కడ ఉన్న మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు.. కాపాడుతూ.. తాము ఉన్న పరిధిలో.. ఈ కళలను ఇలా ప్రదర్శిస్తున్నారు. ఒగ్గు కథ తమ తాతల తండ్రుల కాలానికి.. ఆగిపోతుంది అనుకున్నారు.. కానీ నేటి యాదవ, కుర్మ యువత కూడా.. ప్రపంచంతో పోటీ పడుతూ.. ఏ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ.. తమ పెద్దల నుండి.. ఈ కళలను కూడా వారసత్వం తీసుకుంటున్నారు. సూటు బూటు వేయగలం.. గోసి గొంగడి ఏసి.. కథలు చెప్పగలం.. అని నిరూపించుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి కన్నీళ్లు దిగమింగుతూ.. కాలం వెల్లదీస్తున్నారు. ఎంత చేసినా ఏమి చేసినా.. ఇంత ప్రతిభ ఉన్న.. బట్ట పొట్టకే బతుకులు సరిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతానికి చెందిన తిరుపతి దుబాయ్ లో అద్భుతంగా ఒగ్గు కథను ప్రదర్శించారు. ధన్యవాదాలు మిత్రమా ఫోన్ చేసి అడగగానే.. మీ క్యాంపుకు ఆహ్వానించి సమయం ఇచ్చినందుకు.
ఒగ్గు కథ చెప్పడం అందరితో సాధ్యం కాదు.. కానీ 25 ఏళ్ల నుండి 30 లోపు సంవత్సరాల వయసున్న వీరు.. అలవోకగా ఒగ్గు కథను ప్రదర్శించడం నాకు చాలా నచ్చింది.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.