నవతరం

తెలుగు దినపత్రిక

అమ్మవారి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగరాదు

మెదక్, నమస్తే ఎల్లంపల్లి: శుక్రవారం నాడు జిల్లా ఎస్పి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ మాఘ అమావాస్య సందర్భంగా ఈ రోజు ఏడుపాయల వనదుర్గ భవాని జాతర పోలీసు బందోబస్తూ వివరాలను తెలియజేస్తూ.. దృష్ట్యా భక్తులకు పుణ్య స్నానాలు ఆచరించడానికి వివిద ప్రాంతాల నుండి ఏడుపాయలకు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఏడుపాయల అమ్మవారి ప్రాంగణం మొత్తం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణలో ఉంటుందని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరినారు. ఏడుపాయల వనదుర్గ భవాని మాతా దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, అధికారులకు సూచించారు. మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయాలకు వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో వనధుర్గా అమ్మవారి దర్శనం తదితర కార్యక్రమాలు ముగించుకుని వెళ్లాలని కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి డా. బాలస్వామి ఐ.పి.ఎస్, మెదక్ డి.ఎస్.పి సైదులు, మెదక్ రూరల్ సి.ఐ విజయ్, పాపన్నపేట ఎస్.ఐ విజయ్ నారాయణ్, కొల్చారం ఎస్.ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading