సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్
జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
వెంకటాపూర్, నమస్తే ఎల్లంపల్లి: శిల్పకళకు పుట్టినిల్లు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం గొప్పతనం కండ్లకు కట్టినట్లు వివరించి, దేవాలయం విశిష్టతను ఖండాంతరాలకు చేరేలా చేసిన గైడ్స్ పాత్ర మరువలేనిదని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం రామప్ప దేవాలయాన్ని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సందర్శించారు. దేవాలయంలో గైడ్లుగా పనిచేస్తున్న గోరంట్ల విజయ్ కుమార్, తాడబోయిన వెంకటేష్ లను శాలువాతో సన్మానించారు. రామప్ప శిల్పకళా ప్రాముఖ్యతను గైడ్స్ తస్లీమా కు వివరించారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధిలో గైడ్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే గౌరవ వేతనంతో పనిచేస్తూ దేవాలయాల ప్రాముఖ్యతను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తమదైన శైలిలో వివరిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నారని పేర్కొన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో గైడ్స్ కృషి, పనితీరు అద్భుతమని వారి సేవలను కొనియాడారు. కాగా తమను గుర్తించి సన్మానం చేసిన తస్లీమాకు గైడ్స్ కృతజ్ఞతలు తెలిపారు. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ & ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.