నవతరం

తెలుగు దినపత్రిక

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న ఐ.జి

* ఆలయానికి వెండి పళ్ళెం విరాళం
* అన్మదానం కు మరో భక్తుడు రూ.50 వేలు విరాళం

అలంపూర్, ఫిబ్రవరి 11 (నమస్తే ఎల్లంపల్లి): అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలు శనివారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వీరికి ఆలయ ఈవో పురంధర్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఇదిలా ఉండగా శనివారం రోజు హైదరాబాద్ లోని కర్మన్ఘాట్ వాస్తవ్యులు జగన్మోహన్ గౌడ్ సుమలత దంపతులు ఒక కేజీ 450 గ్రాముల వెండి పళ్ళెం సమర్పించారు. అలాగే హైదరాబాద్ కు చెందిన మరో భక్తుడు అజయ్ కుమార్ అన్నదాన సత్రం కోసం 50 వేల రూపాయలు విరాళాన్ని అందజేసినట్టు ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading