కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: ప్రకృతి పండుగ పూల పండుగ అయినా బతుకమ్మ పండుగను మన తెలంగాణ ప్రాంతంలో 9 రోజులు ఘనంగా జరుపుకుంటారని మొదటి రోజు పండుగని ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో పిలుస్తారని ఈ సంస్కృతి కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో ఉందని కూన మహాలక్ష్మి ట్రస్ట్ చైర్మన్ కూనశ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉత్సవాలలో భాగంగా స్థానిక ద్వారకా నగర్ లో జరిగిన బతుకమ్మల వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ద్వారక నగర్ వాసులు కలిసిమెలిసి కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు చాలా బాగా జరుపుకుంటారు అని చెప్పి ద్వారకా నగర్ కాలనీ అంటేనే కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి మాట్లాడుతూ ఇదేవిధంగా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని చెప్పి బతుకమ్మ పండుగ తెలంగాణలో మంచి ప్రాసస్తం ఉన్నదని దాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్న ద్వారకానగర్ కాలనీవాసులను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ద్వారకా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దరువు అంజన్న వైస్ ప్రెసిడెంట్ హనుమంత రెడ్డి రాజు మరియు అడ్వైజర్ చంద్రయ్య , శేఖర్ , ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహేందర్ శ్రీశైలం అరవింద్ కరుణాకర్ సాయి, టిఆర్ఎస్ నాయకులు కస్తూరి బాలరాజ్ ఓం ప్రకాష్ రెడ్డి యాదవ రెడ్డి రవీంద్రనాథ్ ఠాగూర్ రామరాజు రమణారెడ్డి రామ్మోహన్రావు బ్యాంకు నారాయణ. ప్రభు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ యువతీ యువకులు చేసిన పలు ముత్యాలు అందరిని అలరించాయి.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.