దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) పై దాడి జరిగింది. సివిల్ లైన్స్లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపాయి. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను భాజపా దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సన్దేవ్ ఖండించారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..!
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు దిల్లీ సీఎం రేఖా గుప్తా తన అధికారిక నివాసంలో ప్రతివారం ‘జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువకుడు కొన్ని పేపర్లను ముఖ్యమంత్రికి అందించాడు. అంతలోనే గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్కోట్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఊహించని పరిణామంతో ముఖ్యమంత్రి షాక్కు గురైనట్లు తెలుస్తోంది. ఆమెను వెంటనే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిపై దాడిని రాజకీయ పక్షాలు ఖండించాయి. దిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా మాట్లాడుతూ.. దిల్లీ ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న ముఖ్యమంత్రిపై దాడి చేయడం దారుణమన్నారు. ఇది ప్రత్యర్థుల కుట్ర కావచ్చని అనుమానం వ్యక్తంచేశారు. దీనిలో ఏదైనా రాజకీయ పార్టీ ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అసలేం జరిగింది…?


































































































































































































































































































