నవతరం

తెలుగు దినపత్రిక

నషా ముక్త్ భారత్ కార్యక్రమం 5 ఏళ్లు

* మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి

మెదక్ జిల్లా: మెదక్ అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ నషా ముక్త్ భారత్ కార్యక్రమం లో భాగంగా, సమాజం నుండి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సిబ్బందితో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, యువతను రక్షించడం, సమాజాన్ని వ్యసనాల నుండి కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిదేనని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ వలన కుటుంబాలు, సమాజం, ముఖ్యంగా యువత భవిష్యత్తు దెబ్బతింటుందని గుర్తు చేస్తూ, డ్రగ్స్ రహిత భారత నిర్మాణం కోసం అందరూ కలిసి పని చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading