· వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్త లు పాటించాలని సూచన
· 500 మంది భద్రత సిబ్బంది తో భారీ బందోబస్త్
· క్రిస్మస్ జాతర లో భక్తులు సామజిక దూరం, మాస్కులు ధరించాలని
· మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిణి ప్రియదర్శిని సూచన
మెదక్, నమస్తే ఎల్లంపల్లి: మెదక్ పట్టణంలో గల ప్రపంచ ప్రసిద్ది సి.ఎస్.ఐ. చర్చ్ లో క్రిస్మస్ వేడుకల సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్. అన్నారు. శనివారం నాడు జిల్లా ఎస్.పి. శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్.పి మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద చర్చి మెదక్ లో ఉందని, చర్చిని చూసేందుకు, ఇక్కడ ప్రార్థనలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు సందర్శించడం జరుగుతుందని, కావున ఈ జాతరలో భక్తులకు ఆటంకం కలుగకుండా, వాహనాల పార్కింగ్ గురించి, ట్రాఫిక్ నియంత్రణ గురించి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా మొత్తం 4 సెక్టార్ లను ఏర్పాటు చేసి జిల్లా ఎస్.పి.పర్యవేక్షణలో అదనపు ఎస్.పి, ముగ్గురు డి.ఎస్.పి.లు, 13 మంది సి.ఐ., ఆర్.ఐ.లు, 49 మంది ఎస్.ఐ., ఆర్.ఎస్.ఐ.లు, ఎ.ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్ లు 117 మంది, కానిస్టేబుల్ లు 185 మంది, మహిళా సిబ్బంది 54 మంది, హోం గార్డులు 74 మంది, మరియు 8 అక్సెస్ కంట్రోల్ టీంలు, 4 డే బైనాకులర్ టీంలు, 2 రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, క్రైమ్ టీమ్, షీ టీమ్స్, ఎ.ఆర్. సిబ్బంది, కలిపి మొత్తం దాదాపు 500 మందితో పటిష్టమైన బందోబస్తు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ జాతర బందోబస్త్ ను కమాండ్ కంట్రోల్ సి.సి. కెమెరాల మరియు డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. అలాగే జాతరకు వచ్చే భక్తులు తమ యొక్క వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాల్లోనే తమ వాహనాలను నిలుపుకోవాలని తెలిపినారు. అదేవిధంగా తమ వెంట తీసుకోని వచ్చే వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, అపరిచితులను నమ్మి తమ యొక్క వస్తువులను ఇవ్వరాదని అన్నారు. జాతరలో ఎవరైనా చిన్న పిల్లలు తప్పిపోయినట్లయితే చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలిస్ కంట్రోల్ రూమ్ లో వారి వివరాలు తెలిపాలని, అనుమానితంగా వుండే వస్తువులు, వ్యక్తులు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే పోలిస్ కంట్రోల్ రూమ్ లో తెలపాలని అన్నారు. జాతరలో భద్రతలో భాగంగా బి.డి.టీం, డాగ్ స్వాడ్ లను ఏర్పాటు చేయడం జరిగినదని, భద్రతలో విషయంలో ఎలాంటి రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, అలాగే భద్రత విషయంలో ప్రజలు పోలిసు వారికి సహకరించాలని కోరారు. క్రిస్మస్ వేడుకలకు చర్చి సందర్శించే భక్తులు సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, ఈ సందర్భాగా జిల్లా ప్రజలకు ఎస్.పి. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు. అదేవిధంగా సిబ్బంది కూడా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పనిసరిగా దరించాలని సూచించారు. ఈ సంధర్భంగా బందోబస్త్ కు వచ్చిన సిబ్బందికి డ్యూటి లు వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు యెస్.పి శ్రీ.డా.బి.బాలస్వామి ఐ.పి.యెస్, మెదక్ డి.ఎస్.పి. శ్రీ సైదులు,తూప్రాన్ డి.యెస్.పి శ్రీ.యాదగిరి రెడ్డి, మరియు ఏ.ఆర్. డి.ఎస్.పి. శ్రీనివాస్, మరియు మెదక్ మరియు తూప్రాన్ సబ్ డివిజన్ల సి.ఐ., ఎస్.లు, మెదక్ జిల్లా ఏ.ఆర్. సిబ్బంది, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల సిబ్బంది ఉన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.