హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: హబ్సిగూడ డివిజన్ పరిధిలోని ప్రార్థన మందిరంలో జరిగిన ప్రీ క్రిష్టమస్ వేడుకలకు హజరై క్రిస్టమస్ దుస్తులు పంపిణీ చేశారు. నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. హబ్సిగూడ డివిజన్ చర్చ్ లో జరిగిన వేడుకలకు మత పెద్దలతో కలిసి హజరై కేక్ కట్ చేయడం జరిగింది. పాస్టర్లకు, వందలాది మంది క్రైస్తవ సోదర సోదరిమణులకు క్రిష్టమస్ పండుగను సంతోషాలతో జరుపుకునేందుకు బొంతు రామ్మోహన్ స్వంత నిధులతో క్రిస్టమస్ దుస్తులు పంపిణి చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు గొల్లూరి అంజయ్య, గంధం నాగేశ్వర రావు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబ్సిగూడ డివిజన్ కి చెందిన క్రైస్తవ మత పెద్దలు, సోదర సోదరిమణులందరు బొంతు రామ్మోహన్ కు దన్యవాదాలు తెలిపి, ఆశిస్సులు అందజేసారు.





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.