నవతరం

తెలుగు దినపత్రిక

గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం

* ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ కమాన్ వద్ద బజ్రంగ్ బలి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ టౌర్నమెంట్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమానాలను అందజేశారు. దాదాపు 39 ప్రాంతాల నుండి ఈ పోటీల్లో పాల్గొనగా.. మొదటి స్థానంలో నిలిచిన మహేందర్ నాయక్ జట్టుకు రూ.25 వేలు, రెండవ స్థానంలో నిలిచిన పాపన్నపేట్ జట్టుకు రూ.10 వేలు, మూడవ స్థానంలో నిలిచిన మోకిలి తండా జట్టుకు రూ.5 వేల నగదు బహుమానం, ట్రోఫీలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇటువంటి టౌర్నమెంట్ లు నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జక్కుల కృష్ణా యాదవ్, గోపాల్ రెడ్డి, ఆనంద్, నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, భీమ్ సింగ్ నాయక్, జగన్ నాయక్, విష్ణు యాదవ్, మహేందర్ నాయక్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, ఆర్గనైజర్లు వాసు, చందు, ప్రవీణ్, కోచ్ వినాయ్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading