Navatharam

Telugu Daily

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

* భారీ వర్షాలు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (నమస్తే ఎల్లంపల్లి): భారీ వ‌ర్ష సూచన నేప‌థ్యంలో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లు ఆమె తెలిపారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇండ్ల నుండి బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు. ఏదైనా అత్యవసర సమయంలో కలెక్టరేట్ లో ఏర్పాటు 08744-241950 కంట్రోల్ రూము నంబర్ కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉందని దాటే ప్రయత్నం చేయొద్దని ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Discover more from Navatharam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading