Navatharam

Telugu Daily

సీగాచి ప్రమాదంతోనైనా అధికారులు అలసత్వం వీడాలి

* సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని  సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో 19 కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని, ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలంటే రాష్ట్ర ప్రభుత్వంలోని సీఎం,మంత్రులు పర్యటనలకి పరిమితం కాకుండా అధికారుల్లో ఉన్న అలసత్వాన్ని పారద్రోలి చిత్తశుద్ధితో పని చేయించేలా ప్రణాళికలు రూపొందిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగవని కావున ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్  పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అనేక పేలుడులు జరిగాయని అందులో కార్మికులు మృతి చెందారని కానీ నాడు మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితమై కనీసం ఆ సంఘటన స్థలాన్ని సందర్శించలేదని, ఎక్స్గ్రేషియా ప్రకటించలేదని, ఆ పరిశ్రమల యాజమాన్యాలపై తూతూ మంత్రంగానే కేసులు పెట్టారని కానీ నేటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రులు సంఘటన స్థలాన్ని సందర్శించడం బాధితులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం మంచి పరిణామంగా భావిస్తూ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా పరిశ్రమలపై అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఒకవేళ నిబంధనలను అతిక్రమించిన ఆ పరిశ్రమలను, పరిశ్రమ యాజమాన్యాలను కఠినంగా శిక్షించే చట్టాలను తీసుకురావాలని, నేటికీ జీడిమెట్ల గాంధీ నగర్ బాలానగర్ పారిశ్రామిక వాడలలో అనేక పరిశ్రమలు ఎలాంటి అనుమతులు లేకుండా కెమికల్ డబ్బాలను నిల్వ చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా నైపుణ్యం కలవాలకు అధిక వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని నిపంతో ఎలాంటి నైపుణ్యం లేని వాళ్లను పనులకు ఉపయోగించుకోవడం మరియు కార్మికుల యొక్క వివరాలను కంపెనీ నిబంధన వారి ప్రకారం ప్రభుత్వానికి ఇవ్వకపోవడం లాంటివి జరుగుతున్నాయని ఇప్పటికైనా ఇలాంటి పరిశ్రమల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    భారత కమ్యూనిస్టు పార్టీగా మహాసభల్లో వీటిపైన చర్చించి పరిశ్రమలలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని అన్నారు.

Discover more from Navatharam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading