- రూ.2.50 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే…
- సంతోషం వ్యక్తం చేసిన ప్రజలు
- గజమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: గాజులరామారం డివిజన్ పరిధిలోని వోక్షిత్ ఎంక్లేవ్ కాలనీ ఫేస్-2లో రూ. 2.50 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో కోట్ల రూపాయల నిధులను వెచ్చించి కాలనీలను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోని కాలనీల రూపురేఖలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారాయని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సత్య నారాయణ, మోహన్ రావు, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గోపి గుమ్మిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మారుతి కుమార్, ట్రెజరర్ ప్రసాద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రామిరెడ్డి, సందీప్, రాజేష్ నాయుడు, అడ్వైజర్లు దామోదర్ యాదవ్, కేశవరావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, మసూద్, మూసాఖాన్, దిలీప్, దూలప్ప, ఇమ్రాన్ బేగ్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.






































































































































































































































































































You must be logged in to post a comment.