* లచ్చిరెడ్డి కక్ష సాధింపుతో
కుల బహిష్కరణ
అశ్వరావుపేట రూరల్, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,అశ్వారావుపేట మండలం, రెడ్డిగూడెం గ్రామంలో ఉమ్మల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని కుల బహిష్కరణ చేసి కనీసం ఊర్లో ప్రజలేవరూ వారికి మంచినీళ్లు కూడా ఇవ్వద్దని నిబంధనలు పెట్టినట్లు, ఆ విషయంపై మనస్థాపానికి గురై సదరు వ్యక్తి స్థానిక అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వివరాల్లోకి లోతుగా వెళ్లి పరిశీలిస్తే, కుటుంబ కలహాలతో రెచ్చిపోయిన ఉమ్మల శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉమ్మాల లచ్చిరెడ్డి నలుగురు యువకులను వెంటవేసుకొని తన అన్న పై కక్ష సాధింపు కోసం బయలుదేరిన క్రమంలో, శ్రీనివాసరెడ్డికి సంబంధం లేని ఒక పంచాయతీ విషయంలో, జోక్యం కల్పించుకొని కుల బహిష్కరణ చేయాల్సిందిగా ఆ గ్రామ ప్రజలను పురిగొల్పి గ్రామ బహిష్కరణ చేయించినట్లు గ్రామ ప్రజలు తెలియజేశారు. సర్పంచ్ లచ్చిరెడ్డి మాటలు వినకపోవడంతో, తానే ఆ ఊరి పెద్ద స్థానంలో పెద్ద మనిషిగా చిత్రీకరించుకుని నలుగురు యువకులను వెంటవేసుకొని ఆ గ్రామంలోని కిరాణా షాపు నుండి తెచ్చుకునే నిత్యవసర సరుకులను సైతం , కనీసం మంచినీటిని కూడా ఉమ్మల శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వొద్దనే డప్పు చాటింపు వేయించి, కర్కశంగా ఉమ్మల శ్రీనివాసరెడ్డిని మానసికంగా వేధించడంతో, శ్రీనివాసరెడ్డి పోలీసులను ఆశ్రయించడం, కేసు నమోదు చేయడం, విచారణలో ఉండడం జరిగిందని సమాచారం. తుమ్మల లచ్చిరెడ్డి ఇదంతా ఎందుకు చేశాడనే కోణంలో చూస్తే, గతంలో కుటుంబ కలహాలతో రెచ్చిపోయిన లచ్చిరెడ్డి ఉమ్మల శ్రీనివాసరెడ్డిని అతని భార్యను ఒక మహిళ అని కూడా చూడకుండా కొట్టడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం, ఆ కేసుపై కోర్టులో వాదోపవాదనలు ఇంకా జరగకపోయినా ఆ కేసు విషయంలో శ్రీనివాసరెడ్డిని రాజీపడమని పదేపదే లచ్చిరెడ్డి బెదిరింపులు జరుపుతుండడంతో, శ్రీనివాస్ రెడ్డి అతని భార్య గత కొన్ని నెలలుగా మానసికంగా గురవుతున్నట్లు శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు తెలియజేశారు. కోర్టు పరిధిలో ఉన్న కేసును ఉపసంహరించుకోవడానికి కొంత సమయం ఉందన్న విషయం తెలిసి కూడా లచ్చిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై బెదిరింపులకు పాల్పడటం, ఆ గ్రామ సర్పంచును సైతం తనకు సహకరించమని వేధించడమే కాకుండా, కులం బహిష్కరణ పేరుతో మానసికంగా, శ్రీనివాస రెడ్డిని అతని భార్యను చంపుతానని బెదిరించడం అమానుషం గా భావించి, లచ్చిరెడ్డి మరియు అతని వెంట ఉన్న నలుగురు కిరాతక యువకులపై తగు చర్యలు తీసుకొని తనను కాపాడాల్సిందిగా శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు ను స్వీకరించిన ఎస్ఐ రాజేష్ కుమార్ రిసీవ్డ్ కాపీ ఇవ్వడంతో, ఈ విషయం ఒక కొలిక్కి వచ్చినట్లు, ఉమ్మల శ్రీనివాస్ రెడ్డికి న్యాయం జరిగే అవకాశాలు అందిపుచ్చినట్లు ఉండడంతో శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఇక ఉపశమనం కలిగినట్లేనని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ఎస్సై రాజేష్ పూర్తి విచారణ జరిపి, తగు చర్యలకై కోర్టు ద్వారా శిక్షలు ఖరారు చేయబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై గ్రామ సర్పంచిని అడిగితే, తనకు ఎలాంటి సంబంధం లేదని ఇదంతా ఉమ్మల లచ్చిరెడ్డి, కొందరు యువకులను వెంటవేసుకొని అతని పై కక్షసాధింపుకు పాల్పడుతున్నాడని, పోలీసు వారు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, శ్రీనివాసరెడ్డి కుటుంబానికి న్యాయం జరిగినట్లేనని తెలియజేశారు. ఈ కుల బహిష్కరన కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న పై తమ్ముడి కక్ష సాధింపేనని, పోలీసులు కూడా ఈ విషయాన్ని సరైన కోణంలోనే పరిశీలించి విచారణ జరుపుతున్నారని ఆ గ్రామ ప్రజల సాక్షిగా తెలియజేశారు.






































































































































































































































































































You must be logged in to post a comment.