నవతరం

తెలుగు దినపత్రిక

అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ

* బౌరంపేట్ శ్రీఅయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో ఈరోజు జరిగిన శ్రీఅయ్యప్పస్వామి దేవాలయ 4వ వార్షికోత్సవ వేడుకల్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొని సీనియర్ నాయకులు కేఎం ప్రతాప్, చినంగి వెంకటేశం ముదిరాజ్ తో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు స్వయంగా భిక్షను వడ్డించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ కుటుంబ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading