భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే ఎల్లంపల్లి: డిసెంబర్ 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటన సందర్భంగా విధులు కేటాయించిన అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లుపై కొత్తగూడెం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన విధుల గురించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత ప్రోటోకాల్ ఉన్నటు వంటి వ్యక్తి రాష్ట్రపతి అని, అధికారులు విధుల నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిర్దేశించిన పనులపై అధికారులు మందస్తుగా పరిశీలన చేసి లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రం చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. రహదారుల వెంబడి వ్యర్ధాలను తొలగించాలని చెప్పారు. ప్రసాదు పథకం ద్వారా చేపట్టనున్న పనులతో పాటు మహాబూబాబాద్, ఆసిఫాబాద్ లో నిర్మించిన ఏకలవ్య మోడల్ పాఠశాలలు, మిథాని పరిశ్రమను వర్చువల్ ద్వారా రాష్ట్రపతి ప్రారంభించనున్నట్లు చెప్పారు. అధికారులకు కేటాయించిన విధులను ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని ర. భ. అధికారులకు సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎఎస్పీ రోహిత్ రాజ్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, ఆర్టిఓ వేణు, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు స్వర్ణలత, రత్న కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.