ఇందిరా సాగర్ ప్రాజెక్టు భూములను కబ్జా చేసిన భూస్వామి
సర్వే నెంబర్లకు, జిపిఎస్ లొకేషన్ భూములకు సంబంధం లేనట్లు తప్పుడు రికార్డులతో కబ్జా
సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిలోని మామిడి టేకు మొక్కలను నరికి మూడు కోట్ల రూపాయలకు అమ్ముకుని, సొమ్ము చేసుకున్న వైనం
తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
అశ్వారావుపేట, నమస్తే ఎల్లంపల్లి: ఆయకట్టు కింద పంట పొలాలకు నీరు అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ఇందిరా సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన భూములను రైతుల దగ్గర నుండి సేకరించి నష్టపరిహారంగా వారి భూములకు, పంటలకు లక్షల్లో, సొమ్ము చెల్లించి ఆయా భూములను స్వాధీన పరుచుకున్నది. రోజులు గడుస్తున్న కొద్ది ఆ భూముల్లో ఉన్న మామిడి చెట్ల నుండి వచ్చే ప్రభుత్వ ఫలసాయాన్ని కొందరు దోపిడీ చేస్తుంటే ఆ పంటను స్వాధీనం చేసుకొని, వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ భూముల జాడ తెలియడం లేదనే వింత సమాచారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం, తిరుమల కుంట గ్రామ రెవెన్యూ పరిధిలోని బండారు గుంపు గ్రామ సమీపంలో ఉన్న ఇందిరా సాగర్ ప్రాజెక్టు భూమిలో సర్వే నెంబర్లకు, భూమి జిపిఎస్ లొకేషన్ కు సంబంధం లేదని చూపుతూ, తప్పుడు డాక్యుమెంటరీ తయారు చేసి ఆ భూములను కబ్జా చేసిన ఓ బడా రైతు ప్రస్తుతం అట్టి ప్రభుత్వ భూమిలోనీ మామిడి, టేకు చెట్లను నరికి అమ్మేసుకుని కోట్లలో సొమ్ము చేసుకున్నదే కాక మరల జామాయిల్ సాగు చేస్తున్నట్లు సమాచారం. 631 సర్వే నెంబర్లో , కొన్ని బై నెంబర్లు సుమారు 40 ఎకరాల విస్తీర్ణం గల భూమికి ఓ బడా రైతు రుద్రమకోట ఆర్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం తీసుకుని కూడా, ప్రభుత్వానికి చెందిన మామిడి టేకు చెట్లను నరికి అమ్మేసుకుని కోట్లలో సొమ్ము చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఖజానాను ఇంత దారుణంగా కబ్జాదారు, దళారిగా మారిన బడా రైతు దోపిడీ చేసి అనుభవిస్తుంటే, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఇందిరా సాగర్ ప్రాజెక్టు భూములను ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి కూడా ఇంకా స్వాధీనం చేసుకోక పోవడంపై ప్రజలకు అశ్వరావుపేట నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, కబ్జాదారు,దళారిగా మారిన ఆ రైతు వద్దనున్న భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఖజానాకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు.








































































































































































































































































































You must be logged in to post a comment.