• సూపర్వైజర్ కవిత
పెద్దవంగర, డిసెంబర్ 29(నమస్తే ఎల్లంపల్లి): మండలంలోని గంట్లకుంట ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సర్పంచ్ చింతల భాస్కర్ రావుకు సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అంగన్వాడి కేంద్రం గతంలోనే ఆదర్శ కేంద్రంగా ఎంపికైందని, సరైన వసతులు లేక గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో డిజిటల్ వేయింగ్ యంత్రంతో పాటుగా, సెంటర్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అంగన్వాడీ టీచర్లు ఉత్తమ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్ పసుల స్వరూప పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.