కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దేవేందర్ నగర్ కు చెందిన శ్రీనూతన గౌడ సంఘం కులస్తులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం దేవేందర్ నగర్ లో గౌడ కులస్తుల సామాజిక అవసరాల కోసం స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, శ్రీనూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గోపాల్ గౌడ్, రవీందర్ గౌడ్, యాదగిరి గౌడ్, ప్రభాకర్ గౌడ్, సత్యప్రకాష్ గౌడ్, రవీందర్ కుమార్, సాయి గౌడ్, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.