నవతరం

తెలుగు దినపత్రిక

రాష్ట్రపతిని కలవడానికి అనుమతి ఇవ్వాలని వినతి

భద్రాచలం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి ఈనెల 28న విచ్చేయుచున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కలిసి భద్రాచలం నియోజకవర్గంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ఆదివాసి సంఘాల నాయకులు శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ కు వినతిపత్రాన్ని  అందజేశారు. ఇట్టి విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఆదివాసి సంఘాల నాయకులు తెలిపారు. కలెక్టరును కలిసిన వారిలో న్యాయవాది రవివర్మ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర మహిళా నాయకురాలు కుంజా రమాదేవి, భద్రాచలం మహిళా శక్తి నాయకురాలు కొండ్రు సుధారాణి ఏడబ్ల్యూసీఏ నాయకులు కృష్ణ, నాయకపోడు సంఘం నాయకులు జగ్గా పుల్లయ్య, ఆదివాసి జేఏసీ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading