* అమరజీవి కామ్రేడ్ రవీందర్ రెండవ వర్ధంతి సభలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
ములకలపల్లి, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ ములకలపల్లి మండలం లో సిపిఎం మాజీ మండల సెక్రెటరీ కామ్రేడ్ తానం రవీందర్ మొదటిసంస్కరణ వేదికలలో ఘన నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మతోన్మాద బిజెపి ప్రభుత్వా విధానాలపై ప్రజలు పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని చౌవిటిగూడెం గ్రామంలో తానం రవీందర్ స్ధూపం వద్ద అమరజీవి కామ్రేడ్ తానం రవీందర్ రెండో వర్ధంతి సందర్భంగా సభలో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కామ్రేడ్ తానం రవీందర్ మండలంలో పోడు భూముల పోరాటాలలో జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ అదేవిధంగా ప్రజా ఉద్యమాలు నిర్వహించిన రవీందర్ అని అన్నారు. రవీందర్ ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. మతతత్వ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దార దత్తం చేస్తున్నా రాజ్యాంగంలో ఉండబడిన హక్కులను, చట్టాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం పై ఉద్యమాలు, పోరాటాలు ఉదృతం చేయాలని అన్నారు. దేశంలోని లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,తానం రాంబాబు, రావూజ,పోడియం వెంకటేశ్వర్లు ,నిమ్మల మధు, గౌరి నాగేశ్వరరావు,గోపగాని లక్ష్మీ నరసయ్య, వర్షా శ్రీరాములు,గడ్డం వెంకటేశ్వర్లు,తానం వంశీ,సున్నం శ్రీను,పులి వెంకటేశ్వర్లు, కుర్షం ముత్యాలు, కోండ్రు రాఘవయ్య, సున్నం నాగులు,తదితరులు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.