నవతరం

తెలుగు దినపత్రిక

కోనేరు ఆధ్వర్యంలో బిజెపిలో చేరికలు

లక్ష్మీదేవిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామపంచాయతీలో ఆదివారం నాడు బిజెపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు బిజెపిలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపినే అని, రోజు రోజుకు ప్రజల్లో బిజెపి పై ఆధార అభిమానులు పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో బిజెపి తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవీపల్లి మండల అధ్యక్షులు రవీందర్, ఓబిసి మండల అధ్యక్షులు మాచర్ల ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి గాంధీ, బానోత్ నరేష్, వీరన్న, బాలాజీ, రవి, దేవి, సురేష్, అనూష, జంకు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading