నవతరం

తెలుగు దినపత్రిక

క్యాలెండర్ ఆవిష్కరించిన పుప్పాల భాస్కర్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని చింతల్ మున్నురు కాపు సంఘం కమిటీ సభ్యులు, హెచ్ఎంటి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి పదో వార్షికోత్సవ మరియు నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం యువక మండలి అధ్యక్షులు పుప్పాల భాస్కర్ పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పుప్పాల భాస్కర్

భాస్కర్ మాట్లాడుతూ పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఐక్యతతో కలిసికట్టుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్ చింతల అధ్యక్షులు వేషాల సంపత్ సదానందం, రావుల రాజు, మైస్గారి శ్రీకాంత్, గాదే నర్సింహ, మూర్తి, శ్రీహరీ, కుల సోదరులు పైద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading