నవతరం

తెలుగు దినపత్రిక

సహనాన్ని పరీక్షించొద్దు కేసిఆర్

• మమ్మల్ని ఆపడం మీ తరం కాదు

• మానకొండూరులో నీలిజెండా ఎగరేస్తాం

• బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

మానకొండూర్/ కరీంనగర్, నమస్తే ఎల్లంపల్లి: మానకొండూర్ కేంద్రంలో బిఎస్పి పార్టీ జెండాను కూల్చిన టిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. నిర్మించిన జెండాను కూల్చివేసిన వారిపై కేసు పెట్టినా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కూల్చిన జెండాను తిరిగి నిర్మిస్తుండగా పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు. ఈ నియోజకవర్గంలో మూడు చోట్ల అకారణంగా బిఎస్పి జెండా గద్దెలు కూల్చారన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ అగ్నిగుండం చేస్తామని తెలిపారు. బిఎస్పి పార్టీ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. బిఎస్పి రాజ్యాంగ బద్దంగా నడుచుకుంటామని, మేం రోడ్ల పైకి వస్తే ఆపడం మీ వల్ల కాదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మానకొండూరు నియోజకవర్గంలో 147వ రోజు, చివరి రోజు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గం సమస్యల నిలయంగా మారిందన్నారు. ప్రతి మండలం సమస్యల కేంద్రంగా మారిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఇళ్లు లేవని,పేదల అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని, రోడ్డు సౌకర్యాలు లేవని,పాఠశాలల్లో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క పాలకులు ఇసుక దందా చేస్తూ, ఫాం హౌస్ లు కట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్నించినవారిని కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అందుకే రాబోయే కాలంలో పేదలందరి బతుకులు మార్చడం కోసం మానకొండూరులో నిలిజెండా ఎగురవేస్తామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదల నుండి దోచుకున్న సొమ్ముతో వందకోట్లు పెట్టి డిల్లీలో లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ దోపిడిని అంతం చేయాలంటే పేదల సొమ్మును సమాన పంపిణి చేయాలంటే మన బహుజన రాజ్యం రావాలని అందుకు ఏనుగు గుర్తుకు ఓటేసి బిఎస్పిని గెలిపించాలని కోరారు. చివరి రోజు యాత్ర సందర్భంగా మానకొండూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రాంచంద్రం, రాష్ట్ర సభ్యులు జక్కని సంజయ్, రాష్ట్ర మహిళా నాయకురాలు శిరీష, జోనల్ మహిళా నాయకురాలు స్వరూప, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading