నవతరం

తెలుగు దినపత్రిక

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

సూరారం డివిజన్ లో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నియోజకవర్గం సూరారం డివిజన్ సంజయ్ గాంధీనగర్ ఇమ్మాన్యుఅల్  గ్లోరియస్ చర్చ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదర, సోదరీమణులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నిరుపేదలు కూడా పండుగలు ఘనంగా జరుపుకోవాలని కానుకల పంపిణీకి ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పండుగలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, వేణు యాదవ్, యావన్న సంతోష్ రెడ్డి, డివిజన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, రెహ్మాన్, ముకుంద రావు, చక్క సురేష్ బాబు, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, సాజిద్, మహిళా నాయకురాలు అరుణ, పాస్టర్ ఎలిష, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading