నవతరం

తెలుగు దినపత్రిక

మాజీ కార్పొరేటర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు జన్మదిన వేడుకలు యాదగిరిగుట్టలో జరిగాయి. ఈ వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్, రంగారెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొడ్డు వెంకటేశ్వర రావు ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading