హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ దర్శించుకున్నారు. ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న ఎమ్మెల్యే నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు ఎమ్మెల్యే కు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.