చర్ల: భద్రాచలంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి హాజరు అయిన ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుకి కుర్నపల్లి రైతుల సమస్యలు వివరించడం జరిగింది. 2005కు ముందు నుండి సాగులో ఉన్న, సర్వే చేసిన భూములను కూడా ఫారెస్టు అధికారులు రిజెక్ట్ చేస్తున్నారని, కావాలని ఇవి 2005కు ముందు పోడు భూములు కావని అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని రేగా కాంతారావుకి తెలియజేసారు. వెంటనే స్పందించిన రేగా అధికారులతో మాట్లాడటం జరిగింది. అధికారులు వచ్చి మీ సమస్యను పరిష్కరింస్తారని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి కొటేరు శ్రీనివాసరెడ్డి, గొమ్ముగూడెం సర్పంచి పొడియం మురళి, తుర్రం రవి కుమార్, సీనియర్ నాయకులు బండిరేవు వాసురాజు, గొర్ల రాజబాబు, దొడ్డి తాతారావు పాల్గొన్నారు.





































































































































































































































































































You must be logged in to post a comment.