నవతరం

తెలుగు దినపత్రిక

స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చింతల్ లోని హెచ్ఎంటీ మైదానంలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల తర్వాత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం.. తన చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సమిష్టి కృషి చేసిన అసోసియేషన్ వారికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇటువంటి క్రీడలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎంఈఓ ఆంజనేయులు, చైర్మన్ శివయ్య, అధ్యక్షులు ఆర్.వరప్రసాద్, కార్యదర్శి సిహెచ్ మహేష్ కుమార్, కోశాధికారి దయాకర్, ముఖ్య సలహాదారులు శ్రీనివాస్ గౌడ్, యం.నరసింహులు గౌడ్, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, స్టేట్ కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, సిహెచ్ మల్లేశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, ముంతాజ్ అలీ, జావిద్ అలీ, వి.యన్.చారి, సాధన రాజులు, శశిరేఖ, అలివేలుమంగ, సంగీత మొహతే, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading