కూకట్ పల్లి, నమస్తే ఎల్లంపల్లి: అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ సెయింట్ పీటర్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం సెమి క్రిస్మస్, పాఠశాల వార్షికోత్సవం పురస్కరించుకుని పగిడి ప్రతాప రెడ్డి గార్డెన్స్ లో కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు, ప్రత్యేక గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రంగు రంగుల దుస్తుల్లో విద్యార్థులు చూడ ముచ్చటగా కనిపించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ రాజు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉత్తమమైన లక్ష్యాలను నిర్ధేశించుకొని వాటిని సాధించడానికి కృషిచేయాలన్నారు. విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల సిబ్బంది భారీగా పాల్గొన్నారు.





































































































































































































































































































Editor
Great articles will come from this website. support us.