నవతరం

తెలుగు దినపత్రిక

ఫిట్నెస్ స్టూడియో ప్రారంభించిన ఎమ్మెల్యే

ముఖ్య అతిధిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి.

మేడిపల్లి, నమస్తే ఎల్లంపల్లి: బోడుప్పల్ లోని ఆకృతి టౌన్ షిప్ లో స్టార్ ఫిట్నెస్ స్టూడియో ని ప్రారంభించారు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఫిట్నెస్ స్టూడియో నిర్వాహకుడు జావీద్ మాట్లాడుతూ అందరు ఆరోగ్యాంగా ఉండాలని ఈ ఫిట్నెస్ స్టూడియో ప్రారంభించామని అందరకి అందుబాటు ధరలో వివిధ సేవలు ఉంటాయని తెలిపారు. ముఖ్య అతిధి బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయం నుండి ప్రజలు తమ వ్యక్తిగత ఆరోగ్యం పై దృష్టి పెట్టారని ఇది మంచి శుభ సూచకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading