నవతరం

తెలుగు దినపత్రిక

మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు

* ప్రజల సౌలభ్యం కోసం వార్డు కార్యాలయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే కేపి వివేకానంద్

హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో రేపు నిర్వహించనున్న ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ‘ వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్ లలో 8 వార్డు కార్యాలయాలు ప్రారంభం కానున్నట్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తెలిపారు. ఈ మేరకు.. గాజులరామారం సర్కిల్ లో .. గాజులరామారం డివిజన్ – మహదేవపురం సామాజిక భవనం, జగద్గిరిగుట్ట డివిజన్ – జగద్గిరిగుట్ట మోడల్ మార్కెట్ భవనం, చింతల్ డివిజన్ – భగత్ సింగ్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, సూరారం డివిజన్ – నెహ్రు నగర్ సామాజిక భవనం. కుత్బుల్లాపూర్ సర్కిల్ లో… రంగారెడ్డి నగర్ డివిజన్- గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, సుభాష్ నగర్ డివిజన్ – సుభాష్ నగర్ గణేష్ గ్రౌండ్, కుత్బుల్లాపూర్ డివిజన్ – పద్మ నగర్ ఫేస్ 2 కమ్యూనిటీ హాల్,  జీడిమెట్ల డివిజన్ – గాయత్రి నగర్ మోడల్ మార్కెట్ లలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా వార్డు కార్యాలయాలకు పాలనాధికరులను నియమించడం జరిగిందన్నారు. డివిజన్ స్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారం, ప్రజల సౌలభ్యం కొరకు కొత్త వార్డు కార్యాలయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading