* హాజరైన పలువురు నాయకులు, స్థానిక ప్రజలు
జగద్గిరిగుట్ట, నమస్తే ఎల్లంపల్లి: జగద్గిరిగుట్ట డివిజన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ రషీద్ జన్మదిన వేడుకలు మంగళవారం నాడు స్థానిక ఎంకేఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. సాయంత్రం ఆరు గంటల కు శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్టాప్ వద్ద కేక్ కట్ చేసిన ఆయన ఫంక్షన్ హాల్ వరకు ఊరేగింపుగా బయలుదేరి దారి మధ్యలో అభిమానులు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి స్థానిక ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం ఎంకేఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా రషీద్ భాయ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పలువురు శాలువాలు, పూలదండలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసాని వీరేష్ ముదిరాజ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



























































































































































































































































































































































































































You must be logged in to post a comment.