నవతరం

తెలుగు దినపత్రిక

రషీద్ భాయ్ చిట్టా విప్పిన కొలుకుల జైహింద్

• మోసాలకు మారుపేరంటూ మండిపాటు
• గతం గుర్తుపెట్టుకోవాలంటూ హితవు
• సోషల్ మీడియాలో వెల్లడించిన బీఆర్ఎస్ యువనాయకుడు

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 18: రాష్ట్ర రాజకీయాలు కాస్త నియోజకవర్గ రాజకీయాలయ్యాయి. అనంతరం ఎమ్మెల్యే అనుచరుల రాజకీయాలయ్యాయి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో.. ఇలా కార్పొరేటర్ లు, కంటేస్టెడ్ కార్పొరేటర్లు, కార్పొరేటర్ ఆశావహులు తమ తమ నాయకుడి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కొంత పరిధి దాటి మాట్లాడుతూ వ్యక్తిగత దూషణలకు తెరతీశారు. జగద్గిరిగుట్ట కార్పొరేటర్ గురించి స్థానిక మాజీ టీడీపీ నాయకులు, ఇప్పటి కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ రషీద్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ తన సోషల్ మీడియా (వాట్సాప్) వేదికగా జగద్గిరిగుట్ట హ్యట్రిక్ కార్పొరేటర్ సోదరుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సదరు విషయం ఇలా ఉంది, ఆయన మాటల్లో.. ‘జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఇదే రషీద్ అనే నాయకుడు 2009 సంవత్సరంలో కేదార్నాథ్ అనే వ్యక్తి పేరు చెప్పి 3,00,000/- లక్షల రూపాయలు తీసుకొని ఇప్పటిదాకా కూడా కట్టని వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. రషీద్ ఫస్ట్ ఆ డబ్బులు కట్టిన తర్వాత మాట్లాడవచ్చు, జగద్గిరిగుట్ట డివిజన్ ప్రాంతంలో భూదేవి హిల్స్ లో కబ్జాలు చేసింది ఇదే రషీద్. బాలకృష్ణ అనే వ్యక్తిని భయపట్టిచ్చి 60 గజాల ఫ్లాట్ ను కబ్జా చేసి పంతొమ్మిది లక్షల రూపాయలకు అమ్ముకున్న వ్యక్తి రషీద్, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2009 సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఎలక్షన్లో జగన్ కు మన పార్టీ కార్పొరేటర్ టికెట్.. కాసాని జ్ఞానేశ్వర్ అన్న టికెట్ డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత. కేఎం ప్రతాప్ మాట్లాడుతూ.. జగన్ గెలిచే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి, ఆరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఆరోజు ఇదే శ్రీశైలం గౌడ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే.. ఇదే రషీద్ టిడిపిలో ఉండే. ఈరోజు టికెట్ నేనే ఇప్పిచ్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు, ఆరోజు టిడిపిలో ఉండి టికెట్ ఎలా ఇప్పించావు. అంటే దీనికి అర్థం ఏందంటే. ఆ రోజు నుంచి నువ్వు ఉన్న పార్టీ మోసం చేసే వ్యక్తిని అర్థమవుతుంది. మిత్రులారా ఇప్పటికైనా గమనించండి, రషీద్ అనే వ్యక్తిని మీ పార్టీలో ఉంచకండి. జగద్గిరిగుట్ట డివిజన్ నుండి 2009 సంవత్సరం నుండి ప్రజల ఆదరణతో మూడుసార్లు కార్పొరేటర్ గా గెలిచిన వ్యక్తి జగన్… 2007 సంవత్సరంలోనే ఆర్థికంగా ఉండి ఫైనాన్స్ నడిపించిన వ్యక్తి ఆ రోజుల్లోనే ఇదే రషీద్ అనే వ్యక్తి 30 సంవత్సరాల సీనియర్ నాయకుడు అని చెప్పుకునే వ్యక్తి ఇదే జగన్ దగ్గర ఫైనాన్స్ గా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిన వ్యక్తి ఈరోజు జగన్ గురించి మాట్లాడుతున్నాడు. రషీద్ ఇంకా పది సంవత్సరాలు రాజకీయం చేసినా నువ్వు ఒక నాయకుడిగా ఎదిగిలేవు తస్మాత్ జాగ్రత్త.. మాట్లాడే ముందు నీ గతాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడు’. అని ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలు.. గల్లీ రాజకీయాల వరకు వచ్చాయి, మున్నడు ముందు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. మరి సయ్యద్ రషీద్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి..!

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading