* 23 ఏళ్లకే జడ్జిగా ఎంపికైన గిరిజన యువతి
నవతరం, తమిళనాడు: తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఓ గిరిజన యువతి తొలిసారి సివిల్ జడ్జిగా ఎంపికయ్యింది. సివిల్ జడ్జిగా ఎంపికైన 23 ఏళ్ల శ్రీపతిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీపతి అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె వైద్యులు ప్రమాదమని వారించినా ధైర్యం చేసింది.రెండు రోజుల పసికందుతో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ జడ్జ్ పరీక్ష రాసిన శ్రీపతి ఉద్యోగానికి ఎంపికై చరిత్ర సృష్టించింది.
జడ్జి శ్రీపతి ని అభినందించిన ఎంకే స్టాలిన్



































































































































































































































































































