*బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైంది
*లక్షల కోట్ల బడ్జెట్ లో బిసిల వాటా ఏది?
* డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ
పెద్దపల్లి, నమస్తే ఎల్లంపల్లి: బంగారు తెలంగాణ దొరల ఇంటికే పరిమితమైందని, పేదలకు మాత్రం కనీసం ఇళ్లు లేదు, ఇంటికి తలుపులు లేవని కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 300ల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 148వ రోజు యాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన పెద్దకల్వల, ఉదయ్ నగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పేదల ఇళ్లను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో బిసిలకు లక్ష కేటాయించాల్సి ఉండగా, కేవలం ఆరు వేల కోట్లు కేటాయించి మిగిలిన డబ్బంతా దొరలు లాక్కొని, కోటలు, సెక్రటేరియట్, ఇంద్రభవనాలు కడుతున్నారని విమర్శించారు. ఆత్మగౌరవ భవనాల పేరుతో బిసిలను మోసం చేస్తున్నారని తెలిపారు. తక్షణమే బిసిల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎస్సి, ఎస్టి, బిసి మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో నీటి కొరత కూడా ఎక్కువ ఉందని, వారానికి మూడు సార్లు మాత్రమే నీరు వస్తుందని పేర్కొన్నారు. పట్టణంలో కాలుష్యం ఎక్కువగా ఉందని తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మందులు కూడా ఉచితంగా ఇవ్వడం లేదని ఫలితంగా పిల్లలను చదువు మాన్పించి పనులకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానలో అనేక సమస్యలున్నాయన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15 వేల రూపాయలు ఇస్తానని చెప్పి,కేవలం 7వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. హాస్పిటల్ లో,స్కానింగ్ సౌకర్యాలు లేవని, సాధారణ డెలివరీ కోసం ఒత్తిడి తెచ్చి పిల్లలను చంపుతున్నారని మండి పడ్డారు. రోగులకు మందులు ఇవ్వలేని ప్రభుత్వం దేశంలోనే నెం.1 అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పెద్దపల్లిలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులను కలిసి బహుజన రాజ్యంలో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదానికి గురైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లారీ స్పేర్ పార్ట్స్ పై జిఎస్టి విధించడం అన్యాయమన్నారు. వెంటనే జిఎస్టి ఎత్తివేసి, లారీలకు పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ దోచుకోడానికే అధికారంలోకి వచ్చాయని, అందుకే దొరల పాలన అంతం చేసి పేదల రాజ్యం తెచ్చుకోవాలని, అందుకు ఏనుగు గుర్తుకు ఓటేసి బిఎస్పిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హనుమయ్య, నియోజకవర్గ ఇంచార్జి దాసరి. ఉష, పెద్దపల్లి జిల్లా ఇంచార్జి శేఖర్, అడ్వైజర్ మల్లేష్, నరేష్, మహిళా కన్వీనర్ స్వప్నగౌడ్, జోనల్ కన్వీనర్ సరిత, నియోజకవర్గ కన్వీనర్ శారద, నియోజకవర్గ అధ్యక్షులు దుర్గయ్య, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.