నవతరం

తెలుగు దినపత్రిక

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య

పెద్దవంగర, నమస్తే ఎల్లంపల్లి: సీఎం కేసీఆర్ తోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మండలంలోని పలు నూతన జీపీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటుగా, తండాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది అన్నారు. కాగా మండలంలోని పోచారం, చిన్నవంగర, కాన్వాయిగూడెం, గంట్లకుంట, రెడ్డికుంట తండా, బీసీ తండా, మోత్య తండా, పడమటి తండా గ్రామాల్లో నూతన జీపీ భవన నిర్మాణానికి 20 లక్షల చొప్పున 1.60 కోట్ల నిధులు విడుదల అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమనరసింహ రెడ్డి, పాలకుర్తి యాదగిరి రావు, కనుకుంట్ల వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్, సలీదండి సుధాకర్, సర్పంచులు చింతల భాస్కర్, ధరావత్ రాజేందర్, ధరావత్ భీమా నాయక్, నూనవత్ బాలు, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఎదునూరి శ్రీనివాస్, గ్రామ పార్టీ అద్యక్షులు బోనగిరి లింగమూర్తి, రెడ్డబోయిన గంగాధర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, ఉప్పలయ్య పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading