* అదనంగా 70 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఇమిత్యాజ్ ఇషాక్.
* చైర్మన్ ఇషాక్ ని సన్మానించిన ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్)
ఉప్పల్, డిసెంబర్ 24, నమస్తే ఎల్లంపల్లి: మైనారిటీ అభివృద్ధి ఏ ద్యేయంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఇమిత్యాజ్ ఇషాక్. వివరాలోకి వెళ్తే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తూ యాభై కోట్ల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిశ్చయించిది. ఐదు వేల ముస్లిం మైనారిటీ కుటుంబాలు వీటి ద్వారా లబ్ది చెందుతారు. అయితే మరి కొంత మంది కుటుంబాలకు లబ్ది చేకూరాలని సదుఉద్దేశం తో శుక్రవారం జరిగిన రివ్యూ మీటింగ్లో అదనంగా మరో 70 కోట్లు కేటాయించాలని కోరారు.

దీనితో అదనంగా 7 వేల కుటుంబాలు లబ్ది చెందుతారని తెలిపారు.ఈ మీటింగ్ లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హోమ్ శాఖ మాత్యులు మహమ్మద్ అలీ పాల్గొన్నారు. చైర్మన్ అభ్యర్థన మేరకు అదనంగా కేటాయించారు. ఈ సందర్బంగా చైర్మన్ ఇషాక్ మాట్లాడుతూ పేదల, మైనారిటీ అభివృద్దె ద్యేయంగా మా బి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్బంగా అదనంగా బడ్జెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు హరీష్ రావ్, కొప్పుల ఈశ్వర్,మహమూద్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మైనారిటీ యూత్ అధ్యక్షుడు ఇర్షాద్ ఖాన్ (ఉప్పల్ ఖాన్ ), బద్రుద్దీన్ ( బి ఆర్ ఎస్ నాయకులు )మొహమ్మద్ ఇర్ఫాన్ (కో ఆప్షన్ సభ్యులు ), పాషా, జానీ, నయీమ్, ఫకుర్, జహీద్, అజామ్, యాసీన్ తదితరులు పాల్గొన్నారు.






























































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.